బిగ్ న్యూస్: జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..!

Friday, December 4th, 2020, 02:00:51 AM IST

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్నాయి. నగరంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్ననే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నా ఓల్డ్ మలక్‌పేట్‌లో నేడు రీ పోలింగ్ కారణం చేత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ చేసేందుకు ఈసీ అడ్డుచెప్పింది.

అయితే నేడు ఓల్డ్ మలక్‌పేట్‌లో రీ పోలింగ్ ముగిసిన నేపధ్యంలో పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలను విడుదల చేశాయి. పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన ఫలితాలలో టీఆర్ఎస్ 68-78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 01-05 సీట్లు గెలుచుకుంటుందని తెలపగా, ఆరా సర్వే టీఆర్ఎస్ 78, బీజేపీ 28, ఎంఐఎం 41, కాంగ్రెస్ 03 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక CPS సర్వే విడుదల చేసిన ఫలితాలలో టీఆర్ఎస్ 82-96, బీజేపీ 25-35, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 03-05 సీట్లు గెలుచుకుంటుందని తెలపగా, జన్‌కీ బాత్ టీఆర్ఎస్ 74, బీజేపీ 31, ఎంఐఎం 40, ఇతరులు 5 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిపాయి.