గ్రేటర్ ఫలితాలలో ఇప్పటివరకు ఎవరెన్ని సీట్లు గెలిచారంటే?

Friday, December 4th, 2020, 04:09:38 PM IST

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తుంది. అయితే 2016 ఎన్నికలలో 99 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి కేవలం 60 స్థానాలకే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో 4 స్థానాలలో మాత్రమే గెలిచిన బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఈ సారి ఏకంగా 40కి పైగా స్థానాలను కైవసం చేసుకునే దిశగా కనిపిస్తుంది.

అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ 21 స్థానాలలో గెలిచి మరో 39 స్థానాలలో అధిక్యతను కనబరుస్తుంది. ఇక ఎంఐఎం పార్టీ 27 స్థానాలలో గెలిచి, మరో 13 స్థానాలలో అధిక్యతను కనబరుస్తుంది. ఇక బీజేపీ ఇప్పటివరకు 6 స్థానాలలో గెలవగా మరో 37 స్థానాలలో అధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.