నేడు GHMC ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్న ఈసీ

Tuesday, November 17th, 2020, 10:22:58 AM IST

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి రంగం సిద్దం అయింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను నేడు ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. అయితే డిసెంబర్ 6 లోగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 75 లక్షల నాలుగు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల కోసం అధికార పార్టీ తో సహ ప్రతి పక్ష పార్టీ లు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఈ సారి అధికార పార్టీ కి ఈ ఎన్నికల ఫలితాల తో గట్టి సమాధానం చెప్పాలని ప్రతి పక్ష పార్టీ లు భావిస్తుండగా, తెరాస సైతం మరొకసారి పూర్తి ఆధిపత్యం కనబరిచేందుకు ప్రయత్నం చేస్తోంది.