బిగ్ న్యూస్: GHMC ఎన్నికల నోటిఫకేషన్ విడుదల

Tuesday, November 17th, 2020, 11:33:06 AM IST

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం గడువు 2021 ఫిబ్రవరి వరకు పూర్తి అవుతుంది అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి అన్నారు. ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ ను పార్థసారథి విడుదల చేశారు. అయితే 2016 నాటి రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా ఎన్నికలను నిర్వహించ నున్న విషయాన్ని వెల్లడించారు. అయితే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఓటర్ల జాబితా పై తుది నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో పోలిక బందోబస్తు విషయం లో ఇప్పటికే డీజీపీ, సీపీ లతో చర్చించామని తెలిపారు.

అయితే GHMC ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ ఎన్నికల అధికారి తెలిపారు. అయితే రేపటి నుండి ఈ నెల 20 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉండగా, 21 న నామినేషన్ లని పరిశీలిస్తారు. 24 న నామినేషన్ లను ఉపసంహరించుకొనే అవకాశం ఉండగా, డిసెంబర్ 1 న బల్దియా పోలింగ్ జరుగుతుంది. అవసరమైన పలు కేంద్రాల్లో డిసెంబర్ 3 న రిపోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 4 న ఓట్ల లెక్కింపు తో పాటుగా ఫలితాలను వెల్లడిస్తారు.