బోణీ కొట్టిన ఎం ఐ ఎం…యూసఫ్ గూడ లో తెరాస విజయం

Friday, December 4th, 2020, 12:34:25 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎం ఐ ఎం బోణీ కొట్టింది. మెహిడి పట్నం లో ఎం ఐ ఎం పార్టీ విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక తెరాస అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ యూసఫ్ గూడ లో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో తన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. రెండవ స్థానం లో అధికార పార్టీ తెరాస ఉంది. అయితే పోస్టల్ ఓట్లు తక్కువ గా ఉన్నాయి అని తెలుస్తోంది. ఇక స్థానిక ఓట్ల తో విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.