8 గంటలకు ప్రారంభం అయిన గ్రేటర్ ఓట్ల లెక్కింపు

Friday, December 4th, 2020, 08:30:25 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 150 హాల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కొక్క హాల్ లో 14 టేబుల్ లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కౌంటింగ్ ను ఒక సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు పరిశీలించనున్నారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ ను సీసీ కెమెరాలతో రికార్డ్ చేయనున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో 74 లక్షలకు పైగా వోటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదు.

అధికార పార్టీ తెరాస, ఎం ఐ ఎం, బీజేపీ ల తో పాటుగా కాంగ్రెస్ పార్టీ లు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 1,122 స్థానాలకు గానూ పోటీ చేశారు. నేడు వారి భవితవ్యం తేలనుంది. అయితే మెహిది పట్నం లో మొదటి ఫలితం వెలువడనుంది. అత్యంత తక్కువగా ఓట్లు పోల్ అవ్వడం తో అక్కడ మొదటి రౌండ్ లోనే ఫలితం తేలే అవకాశం ఉంది.