జీహెచ్ఎంసీ చట్ట సవరణలో జరగబోతున్న మార్పుల గురుంచి రాజకీయ వర్గాలలో ఆసక్తి చర్చ నడుస్తుంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి యథాతథ కొనసాగింపు ఉంటుందన్న సంకేతాలు వినబడుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ యాక్ట్-19లోని పలు సెక్షన్ల ఆధారంగా జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్టు తెలుస్తుంది.
అయితే వాస్తవంగా 1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హులు. అయితే ఈ నిబంధనను మినహాయిస్తూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జనవరిలో జరిగిన ఎన్నికలలో కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు అదే తరాహాలో జీహెచ్ఎంసీ యాక్ట్‌లోని పలు క్లాజ్‌లను తొలగిస్తూ సవరణలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సవరణలు జరిగితే గ్రేటర్‌లోనూ సంతానం ఎందరు ఉన్నా పోటీ చేసే అవకాశం ఏర్పడుతుంది.