విషాదం: విశాఖ లో మరొక గ్యాస్ లీకేజీ ఘటన…ఇద్దరు మృతి!

Tuesday, June 30th, 2020, 08:27:49 AM IST

వైజాగ్ లో ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ లీకేజీ ఘటన కారణంగా 14 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన మరువక ముందే వైజాగ్ లో మరొక గ్యాస్ లీకేజీ జరిగింది. పరవాడ ఫార్మా సిటీ లోని సాయినార్ కెమికల్స్ నుండి గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు మృతి చెందారు. మరొక నలుగురు తీవ్ర అస్వస్థకి గురి అయ్యారు. అయితే మరణించిన ఆ ఇద్దరినీ నరేంద్ర, గౌరీ శంకర్ లుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటన లో అస్వస్తకు గురి అయిన వారి నందరిని గాజువాక లోని ఆర్కే ఆసుపత్రి కి తరలించడం జరిగింది.

ఆసుపత్రి లో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన పై వివరాల్ని సేకరించేందుకు అక్కడి కలెక్టర మరియు పోలీస్ కమీషనర్ సంఘటన స్థలికి చేరుకున్నారు. ఘటనకు కారణమైన పరిస్థితుల పై సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఘటన పై ఒక కమిటీని వేసేందుకు అధికారులు నిర్ను తీసుకున్నారు. హైడ్రోజన్ సల్ఫైద్ ఎక్కువగా రియాక్టర్ వద్దకు రావడం తో ఈ గ్యాస్ లీక్ అయి ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ ఘటన పై ఇప్పటికే ఎంపీ విజయ సాయి రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుకు తగ్గ సహాయక చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే వైజాగ్ లో మరొక సారి గ్యాస్ లీకేజీ కావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.