బిగ్ బ్రేకింగ్ : గంటా మామూలు స్కెచ్ వెయ్యలేదుగా.?

Tuesday, February 25th, 2020, 09:01:38 AM IST

ఏపీ రాజకీయ బర్గాల్లో గంటా శ్రీనివాసరావు పేరు తెలీనివారు ఉండరు.ఓటమి అంటూ ఎరుగని నేతగా గంటాకు ఏపీ రాజకీయ వర్గాల్లో మంచి హైప్ ఉంది.తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా సరే తన స్ట్రాటజీలతో ఎలా అయినా సరే గెలిచి చూపే కీ పొలిటీషియన్ గా మంచి పేరు కూడా ఉంది.అయితే గడిచిన 2019 ఎన్నికల్లో తాను టీడీపీ తరపు నుంచి పోటీ చెయ్యగా ఆయన గెలిచారు కానీ పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది.

దీనితో ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉండే గంటా పార్టీ మారిపోతారని విస్తృత ప్రచారం జరిగింది.వైసీపీ లేదా బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతారని వార్తలు రాగా వాటన్నిటినీ తప్పు చేస్తూ గంటా షాకిస్తూ టీడీపీలోనే ఇంకా కొనసాగుతున్నారు.అయితే తాను అలా ఉండిపోడానికి కూడా గట్టి కారణమే ఉందని ఏపీ రాజకీయాలు అంటున్నాయి.

గంటా టీడీపీలోనే కొనసాగుతూ తన వంతుగా పార్టీను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు వేస్తున్నారని రాబోతున్న స్థానిక ఎన్నికల సమరానికి తమ పార్టీ సత్తాను చూపించాడనికి ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలు గంటా ద్వారా జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.ఈ కారణం చేతనే గంటాపై ఎన్ని పుకార్లు వచ్చినా సరే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఊరుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.