టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన గంటా ప్రధాన అనుచరుడు..!

Wednesday, March 3rd, 2021, 05:12:48 PM IST

ఏపీలో విపక్ష టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నా, మరో వైపు వలసల పర్వం మాత్రం ఆగడం లేదు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరిపోయాడు. ఎంపీ విజయసాయిరెడ్డి కండువా కప్పి కాశీ విశ్వనాథ్‌ను వైసీపీలో చేర్చుకున్నారు. అయితే ఇప్పటివరకు గంటాకు కుడిభుజంలా ఉంటూ, గంటాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు.

అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు ముందు గంటా ప్రధాన అనుచరుడు పార్టీ మారడం టీడీపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. అయితే గంటా అనుచరుడు వైసీపీలో చేరడంతో గంటా కూడా త్వరలోనే వైసీపీలో చేరుతారనే చర్చ మళ్ళీ మొదలైంది. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తా అంటే మేము కాదంటామా అంటూ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే గంటా వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.