వైసీపీలోకి చేరేందుకు గంటా డేట్ ఫిక్స్.. మరో రెండు రోజుల్లో..!

Friday, August 7th, 2020, 08:19:04 PM IST

ganta-srinivas-rao

ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి టీడీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీనీ వీడిపోవడంతో బాగా చతికిలపడిన ఆ పార్టీకి తాజాగా గంటా రూపలో మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్న గంటా మరో రెండు రోజుల్ల్లో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఎప్పటినుంచో గంటా వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపధ్యంలో విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడంతో ఇదే మంచి సమయమని భావించిన గంటా ఈ నెల 9వ తేదిన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. ఇదే కనుక జరిగితే టీడీపీ మరో కీలక నాయకుడిని కోల్పోయినట్టే అని చెప్పవచ్చు.