అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా.. క్లారిటీ ఇచ్చిన గంటా..!

Monday, February 15th, 2021, 05:02:55 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. అయితే చాలా కాలంగా టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాస్ టీడీపీని వదిలించుకోవడం కోసం విశాఖ ఉక్కు పేరుపై రాజీనామా చేశారని విమర్శలు వినబడుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన గంటా టీడీపీని వదిలించుకోవాలంటే ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

అంతేకాదు పార్టీ నుంచి తాను వెళ్ళిపోవాలనుకుంటే తమ నాయకుడు చంద్రబాబును కలిసి కారణాలను వివరించి పార్టీ నుంచి వెళ్లిపోతానని అన్నారు. విశాఖ ప్రజల రుణం తీర్చుకునేందుకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మళ్లీ ఉపఎన్నికలో కూడా తాను పోటీ చేయనని అన్నారు. ఉక్కు కర్మాగారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.