బిగ్ న్యూస్: వైసీపీలో చేరికపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన గంటా..!

Wednesday, March 3rd, 2021, 11:23:34 PM IST

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నేడు గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరడం, గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారని, వాటిని పార్టీ ఆమోదిస్తే వైసీపీలో చేర్చుకుంటామంటూ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇక గంటా వైసీపీలో చేరడం ఫిక్స్ అయిపోయినట్టే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.

అయితే విజయసాయి వ్యాఖ్యలపై, వైసీపీలో చేరికపై గంటా మరోసారి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. నాపై 2019 జనరల్ ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ తరువాత మరియు ఇప్పటివరకు 100 సార్లు పైగా ఇటువంటి ప్రచారాలు వచ్చాయని, కొన్ని సార్లు వైసీపీ లో చేరుతున్నట్లు డేట్స్, ముహుర్తాలు కూడా పెట్టేసారని ఒకసారి బీజేపీ అన్నారు, కాదు కాదు మళ్ళీ వైసీపీ అన్నారు. ఇలా రక రకాల వార్తలు నా మీద వస్తూనే ఉన్నాయి నేను ఇప్పటికే చాలా సార్లు వాటిని ఖన్డిస్తూనే వస్తున్నాను, సడన్ గా ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదు, నేను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డి గారే సమాధానం చెప్పాలని గంటా అన్నారు.