ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రమే దిగొస్తుంది అని అప్పుడు జగనే చెప్పారు – గంటా శ్రీనివాస్

Wednesday, March 10th, 2021, 01:21:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నేతగా వ్యవహరిస్తున్న సమయం లో చేసిన వ్యాఖ్యల ను గుర్తు చేసుకున్నారు. ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగోస్తుంది అని ప్రతి పక్ష నేత గా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు అని వ్యాఖ్యానించారు. అయితే విశాఖ నగర పాలక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం గంటా శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని సూచించారు. దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలి అని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎంపి లు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది అని పేర్కొన్నారు. అయితే రాజీనామాలు చేసేందుకు అంతా సిద్దం కావాలి అంటూ పిలుపు ఇచ్చారు. మరొకసారి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది.