పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం ప్రకటించాలి – గంటా శ్రీనివాస్ రావు

Sunday, February 21st, 2021, 05:07:50 PM IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర నిర్ణయం పట్ల అటు అధికార పార్టీ వైసీపీ నేతలు, ఇటు తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నేత గంటా శ్రీనివాస్ రావు ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం పట్ల బీజేపీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకుంటాం అని ఎందుకు ప్రకటించడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో బీజేపీ బాగస్వామి గా ఉన్న పవన్ కళ్యాణ్ కి బాధ్యత ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. హక్కు కూడా ఎక్కువ ఉంది అని, దీని పై పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం చేయాలి అంటూ గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యానించారు.

అయితే వంద శాతం స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నాం అని కేంద్ర మంత్రులు, అధికార మంత్రులు ప్రకటిస్తున్నారు అని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు అని అన్నారు. అయితే జనం ఆందోళన లో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుంది అని,నిర్దోషి మెడకు ఉరితాడు బిగించి ఇంకా శిక్ష అమలు కాలేదు కదా ఎందుకు రాద్దాంతం అన్నట్లుగా ఉంది బీజేపీ వైఖరి అంటూ గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.