గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్..!

Saturday, October 24th, 2020, 02:00:05 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది. సామాన్య జనంతో పాటు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా బారిన పడి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్‌ వంటి నేతలు చనిపోయారు.

అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నేడు నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్ అని తేలడంతో ఆయనను 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వల్లభనేని వంశీ కోరారు.