బిగ్ న్యూస్: ధోనీ కెప్టెన్సీ పై సెహ్వాగ్, గంభీర్ ల కీలక వ్యాఖ్యలు!

Wednesday, September 23rd, 2020, 03:57:46 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ గురించి యావత్ భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అయితే ధోనీ కెప్టెన్సీ విషయం లో అప్పుడప్పుడు పలుమార్లు విమర్శలు వచ్చినా, తను మాత్రం తన ఆటతీరు తో కూల్ గా సమాధానం ఇస్తారు. అయితే మంగళవారం నాడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ కెప్టెన్సీ పై గంభీర్ మరియు సెహ్వాగ్ లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

217 పరుగుల లక్ష్య చేధనలో అనుభవం లేనటువంటి సామ్ కరణ్ మరియు రుతురాజ్ లను పంపి, 38 బంటులకు 103 పరుగుల అవసరం ఉన్న దశలో ధోనీ క్రేజు లోకి వచ్చారు. అయితే చివరి వరకు సింగిల్స్ కే పరిమితం అయి, ఆఖరి ఓవర్ లో మూడు సిక్స్ లు బాదాడు. సిక్సర్లు బాదినా ఓటమి ఖరారు అయింది అని గంభీర్ అన్నారు. అయితే ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ కి దిగడం ఆశ్చర్యం కల్గించింది అని, అలా రావడం ముందుండి నడిపించడం ఎలా అవుతుంది. ఆఖరు ఓవర్ లో చేసిన పరుగులు ఏం ప్రయోజనం అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఇదే విషయం ను సెహ్వాగ్ సైతం ప్రస్తావించారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ కెప్టెన్సీ బాగోలేదు అని, ఏడో స్థానం లో ఎందుకు వచ్చాడో అర్దం కాలేదు అని, ధోనీ కెప్టెన్సీ కి ఈ మ్యాచ్ లో 10 కి 4 మార్కులే వేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.