సూర్యాపేటలో జాతీయ కబడ్డీ పోటీల్లో అపశృతి.. కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ..!

Tuesday, March 23rd, 2021, 01:07:18 AM IST


సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. స్టేడియంలో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన మూడో నంబర్ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సుమారు 100 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తుంది. స్టేడియంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడంతోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం.

అయితే ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సూర్యపేటలో గుంతకండ్ల సావిత్రమ్మ పేరు మీద ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇలా ప్రమాదం జరగడం అందరిని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది.