2022 ఎన్నికలకు సిద్దంగా ఉండాలి.. ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు..!

Friday, October 23rd, 2020, 03:01:22 PM IST

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తుందని 2022లో ఎన్నికలు జరగవచ్చని అన్నారు. అయితే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు అప్పుడే అర్ధమైపోయిందని ఇక వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో భయానక వాతావరణం కనిపిస్తుందని అధికారులు, పోలీసులు వైసీపీ మద్ధతుదారులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్‌లో ఆందోళన నెలకొందని అన్నారు. అయితే 2022 ఎన్నికలకు టీడీపీ నేతలు, కార్యకార్తలు సిద్దంగా ఉండాలని అన్నారు.