సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన గద్దర్..!

Friday, November 20th, 2020, 03:00:17 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గద్దర్‌ను కలిశారు. అయితే మంత్రి కొప్పులతో ముచ్చటించిన గద్దర్ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందని చెప్పుకొచ్చాడు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం సిద్దపడ్డారని అన్నారు.

ఆనాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు కేసీఆర్ 14 రోజుల పాటు కఠోర దీక్ష చేయడం మామూలు విషయం కాదని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల గతిని మార్చాల్సిన అవసరం ఉందని దాని కోసం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే, దానికి అనుబంధంగా తాను కల్చరల్ ఫ్రంట్ పెట్టి మద్ధతు ఇస్తానని తెలిపారు. ఇది పక్కనపెడితే టీఆర్ఎస్ కార్పోరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి మరోసారి తిరిగి పోటీ చేస్తున్న సబితా కిశోర్‌ను గద్దర్ ఆశీర్వదించారు.