తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

Sunday, November 15th, 2020, 09:27:16 AM IST

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైటి రాజా ఆదివారము నాడు ఉదయం మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మాజీ ఎమ్మెల్యే కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం పాలయిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అయితే హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వైటి రాజా ఆదివారం నాడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1999 లో తెలుగు దేశం పార్టీ తరపున తణుకు నుండి గెలుపొంది ప్రాంత ప్రజలకి ఐదేళ్ల పాటు సేవ చేశారు. ఆయన మృతి పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.