మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత!

Monday, August 31st, 2020, 06:16:57 PM IST

Pranab-Mukherjee

మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ లో ఆర్మీ రీసెర్చ్ రిఫరల్ ఆసుపత్రి లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అనారోగ్యం తో ఆసుపత్రి లో చేరిన 84 సంవత్సరాల ప్రణబ్ ముఖర్జీ మెదడు లో రక్తం గడ్డ కట్టడం చేత శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో కరోనా వైరస్ కూడా సోకడం తో ఆరోగ్య పరిస్థితి మరింత గా విషమించి తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేత గా ఎదిగారు.

యాబై ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో అనేక పదవులు నిర్వహించిన ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ కి వివాద పరిష్కార్త గా పేరు గాంచారు. 1969 లో రాజకీయాల్లో కీలక అడుగు వేశారు ప్రణబ్. ఇందిరా గాంధీ రాజ్యసభ కి కాంగ్రెస్ తరపున పంపారు. అనంతరం 1973 లో మంత్రి వర్గం లో చోటు సంపాదించుకున్నారు. 1982 లో ఆర్ధిక మంత్రి గా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ, అలా అంచెలంచెలుగా ఉన్నత పదవుల్లో దేశానికి సేవలు అందించారు. 2012 నుండి 2017 వరకు దేశానికి 13 వ రాష్ట్రపతి గా బాధ్యతలను నిర్వర్తించారు.