టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కారు బోల్తా..!

Wednesday, December 30th, 2020, 07:28:56 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. న్యూఇయర్ వేడుకుల కోసం కుటుంబంతో కలిసి అజారుద్దీన్ రాజస్థాన్ వెళ్తుండగా తన కారు బోల్తా పడింది. రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌ వద్ద మెగా హైవేపై అజారుద్దీన్ కారు ఓవ‌ర్ ట‌ర్న్ అయ్యింది. దీంతో కారు బోల్తా ప‌డిన‌ట్లు తెలుస్తుంది.

అయితే కారు టైర్లు పేలడం వలన అజారుద్దీన్‌ ప్ర‌యాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న ధాబాలోకి దూసుకువెళ్లింది. దీంతో ధాబాలో ప‌నిచేస్తున్న ఇషాన్ అనే వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్ర‌మాదంలో అజార్ కుటుంబ‌స‌భ్యులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే క్రికెట‌ర్ అజార్ మ‌రో వాహ‌నంలో హోట‌ల్‌కు బయలుదేరి వెళ్ళారు.