ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీలో వరద సాయం బంద్..!

Wednesday, November 18th, 2020, 04:54:58 PM IST

గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ వరద బాధితులకు అందించే సాయంపై పడింది. గ్రేటర్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో వరద బాధితులకు అందించే రూ.10,000 సాయాన్ని వెంటనే ఆపేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీనికి సంబందించిన దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని కోరింది.

అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ యధావిధిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని సూచించింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదిన జరగనుండగా, డిసెంబర్ 4వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి దరఖాస్తులు కూడా స్వీకరించడానికి వీల్లేదు. కాగా ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్న వారికి సాయం అందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.