కరోనా ఎఫెక్ట్ : ఫ్లిప్ కార్ట్ మరొక సంచలనమైన నిర్ణయం…?

Wednesday, March 25th, 2020, 04:00:03 PM IST

ప్రపంచాన్ని అంతటిని కూడా దారుణంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ భారత్ లో విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా చాలా వరకు ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ భయంకరంగా వ్యాపిస్తున్న తరుణంలో వాల్‌మార్ట్‌ ఇండియాకు చెందిన ఈ సంస్థ, తన సర్వీసులను కొంత కాలం వరకు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుకున్న ఈ సంస్థ, మన దేశ ప్రజలందరి ఆరోగ్య నిమిత్తం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తాజా సమాచారం.

ఇకపోతే ప్రజల, వినియోదారుల నిత్యావసరాలను తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమని, వీలైనంత తొందరగానే మళ్ళీ తమ వినియోగదారుల అవసరాలను తీరుస్తామని అధికారికంగానే ప్రకటించింది. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ప్రజలందరూ సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉన్నందువలన, ఇలాంటి ప్రైవేట్ సంస్థలతో పాటు, మిగిలిన సంస్థలన్నీ కూడా ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా… ఇకపోతే ఈ వైరస్ మరింతగా ప్రబలకుండా ఉండేందుకు జనతా కర్ఫ్యూ మాదిరి వచ్చే నెల 15 వరకు గృహ నిర్బంధం విధించిన సంగతి మనకు తెలిసిందే.