వారికి రూ. 5 వేలు ప్రోత్సాహకం.. సీఎం జగన్ కీలక నిర్ణయం..!

Friday, July 31st, 2020, 05:40:36 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నేడు కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుదలపై చర్చించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్స విషయంలో కీలకంగా మారుతుందని భావిస్తున్న ప్లాస్మా థెరపీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

అయితే ప్లాస్మా థెరఫీ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటే దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చేవారికి రూ. 5 వేలు ప్రొత్సాహకం అందించాలని తెలిపారు. కరోనాతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి బెడ్ ఇవ్వాలని అక్కడ బెడ్ లేకపోతే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్ ఎక్కడ ఉందో సమాచారం ఇవ్వాలని అన్నాడు. ఇక కరోనా రోగులకు బెడ్స్ లేని పరిస్థితి రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.