ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

Sunday, January 31st, 2021, 08:53:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే దశల వారీగా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత లో 3,249 సర్పంచ్ మరియు 32,504 వార్డ్ మెంబర్ స్థానాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 1,317 నామినేషన్లు, వార్డ్ స్థానాలకు 2,200 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రెండవ రోజు సర్పంచ్ స్థానాలకు 7,460 మరియు వార్డ్ స్థానాలకు 23,318 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే నేడు ఆఖరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

అయితే రేపు నామినేషన్ల ను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి రెండవ తేదీన నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుంది. ఫిబ్రవరి మూడవ తేదీన తుది నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. ఫిబ్రవరి నాల్గవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కి తుది గడువు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొన్ని ఏళ్ళ తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండటం, నోటా కి కూడా పోలింగ్ కి అవకాశం ఇవ్వడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.