“జెన్నిఫర్” గా ఒలివియా మోరిస్… ఫస్ట్ లుక్ విడుదల చేసిన “ఆర్ఆర్ఆర్” టీమ్!

Friday, January 29th, 2021, 02:02:35 PM IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న రౌద్రం రణం రుధిరం చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.

అయితే ఒలివియా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. జెన్నిఫర్ పాత్రలో ఒలివియా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లాంటి ప్రముఖులు కూడా నటిస్తుండటం తో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 న చిత్రం విడుదల కానున్న సంగతి అందరికి తెలిసిందే.