గూస్ బంప్స్ తెప్పిస్తున్న “విరాట పర్వం ఫస్ట్ గ్లింప్స్”

Monday, December 14th, 2020, 02:06:19 PM IST

దగ్గుబాటి రానా నటిస్తున్న సరికొత్త చిత్రం విరాట పర్వము. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ చిత్రం లో కామ్రేడ్ రవన్న పాత్ర లో రానా నటిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో వున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి, రానా లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ అంటూ అభిమానులు టీజర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో సాయి పల్లవి కథానాయిక గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై చిత్రం విడుదల కానుంది. అయితే దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.