కరోనా సోకిన తొలి కుక్క మృతి.. ఎక్కడో తెలుసా?

Friday, July 31st, 2020, 12:49:04 PM IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. రోజు రోజుకు విస్తరిస్తున్న ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే కేవలం మనుషులలోనే ఈ వైరస్‌ని ముందు గుర్తించినా ఆ తరువాత కొన్ని జంతువులలో కూడా ఈ లక్షణాలు గుర్తించారు.

అయితే ఈ కరోనా వైరస్ బారిన పడిన తొలి కుక్క చనిపోయింది. జంతువులలో ప్రపంచంలోనే తొలిసారిగా USAలోని రాబర్ట్ అనే వ్యక్తి దగ్గర ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఏడేళ్ళ కుక్కకు కరోనా సోకింది. అయితే ఇటీవల ఆ కుక్క మరణించినట్టు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ వెల్లడించింది. USAలో ఈ కుక్క తరువాత ఒక పులి, ఒక సింహం, 10 పిల్లులు, 12 కుక్కలకు కరోనా సోకింది.