ఈ నెల 16 న మూడు లక్షల మందికి కరోనా టీకా!

Thursday, January 14th, 2021, 11:19:31 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ వాక్సిన్ ను ఈ మేరకు భారత్ దేశ వ్యాప్తంగా పంపిణీ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే జనవరి 16 న ప్రారంభం కానున్న ఈ వాక్సినేషన్ ప్రక్రియ, మొదటి రోజు మూడు లక్షల మంది కి టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ వారియర్స్ గా నిలిచిన ఆరోగ్య శాఖ వారికి ఈ టీకా ముందుగా వెళ్లనుంది. భారత్ అంతటా మొత్తం 2,934 కేంద్రాల్లో ఈ టీకాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ 16 వ తేదీన ప్రారంభించనున్నారు.

అయితే దేశం లో అత్యవసర వినియోగం కోసం తీసుకొచ్చిన ఈ కోవాగ్జిన్, కోవీషిల్డ్ టీకాల విషయం లో అధికారులు ఒక స్పష్టత ఇచ్చారు. లబ్ది దారులు దేన్నీ ఎంచుకోవాలని అనేది తమ చేతి లో లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కోటికి పైగా టీకాలను వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1.65 డోస్ లను సేకరించిన ప్రభుత్వం అందులో 1.1 కోవీషీల్డ్, మిగతా 50 లక్షల డోసు లు కోవాగ్జిన్ నుండి సేకరించింది. అయితే ఈ రెండు డోసుల్ని 28 రోజుల వ్యవధి లో ఇవ్వనున్నారు, అంతేకాక వాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత దీని ప్రభావం ఉండనుంది.