కరోనా మొదటి వాక్సిన్ హైదరాబాద్ నుంచే అంటున్న కేటీఆర్.!

Tuesday, August 4th, 2020, 05:10:56 PM IST

ktr

ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కరోనా వాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ వాక్సిన్ విషయంలో ఆశలు చిగిరింపేలా చేస్తున్నారు కానీ ఇంకా ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకు వస్తారో అన్నది ఇంకా ఎవరూ స్పష్టతను ఇవ్వడం లేదు. దీనితో వాక్సిన్ కోసం అలా ఎదురు చూపులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా ఫార్మా వ్యవస్థలో మన దేశం ప్రపంచ దేశాలు అన్నిటితో పోలిస్తే చాలా కీలకమైన పాత్రను పోషిస్తుందని ఎందరో ఇతర దేశాల దిగ్గజాలే చెప్తున్నా మాట.

అలాగే మన దేశ శాస్త్రవేత్తలు కూడా కరోనాకు వాక్సిన్ ను కనుగొనే ప్రక్రియలో ఉన్నారు. అలా మన హైదరాబాద్ కు చెందిన బయో వాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను సందర్శించిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ భారత్ బయో టెక్ సంస్థ నుంచే మొట్టమొదటి కరోనా వాక్సిన్ రానుంది అని ఇప్పటికే ఇక్కడి శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అలాగే ఈ వాక్సిన్ తయారీలో భారత్ బయో టెక్ సంస్థ ముందు వరుసలో ఉండడం గర్వంగా ఉందని అందుకే మన దగ్గర నుంచే మొదటి వాక్సిన్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. అలాగే హైదరాబాద్ లో మొదట వాక్సిన్ వచ్చిన తర్వాతనే భారత్ మొత్తం పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. మరి కేటీఆర్ అన్నట్టుగా మన దగ్గర నుంచే వాక్సిన్ మొదటగా వస్తే మంచిది. లేదా మళ్ళీ వీరిపై విమర్శలు తప్పవు.