తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే తేది ఖరారు..!

Wednesday, December 16th, 2020, 03:22:05 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపీణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ అందించింది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యాక్షన్‌ ప్లాన్‌ షురూ అయ్యింది. రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ వేసే తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 18వ తేదీన తొలి కరోనా టీకా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

అయితే తెలంగాణ కేంద్రంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌నే రాష్ట్రంలో పంపిణీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. తొలుత హెల్త్ వర్కర్లకు తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆ తర్వాత 50 ఏళ్ళు పైబడిన వారికి మరియు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీపై రెండ్రోజుల క్రితం అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు.