దారుణం : ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం – 9 మంది మృతి

Monday, December 23rd, 2019, 08:14:51 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో మరొక దారుణం జరిగింది. కేవలం రెండు వారాల వ్యవధిలో మరొక భారీ అగ్నిప్రమాదంజరిగింది. కాగా ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 9 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఢిల్లీలోని కిరారి ప్రాంతంలోని ఒక బట్టల గోడౌన్‌లో నేడు సూర్యోదయానికి ముందే అర్థరాత్రి 12.30 సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చాలా మంటలు వ్యాపించాయి. అప్పటికే ఆ మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. అందులో దాదాపుగా 9 మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు., దానికితోడు మరో 10 మంది ఆ మంటల కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వారు అక్కడికే చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా బూడిదగా మారిపోయిందని చెప్పాలి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రాథమిక నిర్ధారణకి వచ్చినప్పటికీ కూడా, మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే రాజధాని ఢిల్లీలో ఇదే నెలలో ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో దాదాపుగా 50 మందికి పైగా చనిపోవడం అనేది దారుణమని చెప్పాలి.