బంజారా హిల్స్ యాక్సిస్ బ్యాంకులో అగ్ని ప్రమాదం

Thursday, January 29th, 2015, 10:07:57 AM IST


హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయంలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యాక్సిస్ బ్యాంక్ కార్యాలయం పూర్తిగా తగలబడిపోయింది. కాగా కాంప్లెక్స్ లోని రెండో అంతస్థులో చెలరేగిన మంటల కారణంగా బ్యాంక్ లోని ఫర్నిచర్ తో పాటు కీలక ఫైళ్లు అన్నీ మంటలకు ఆహుతి అయ్యాయి. అయితే ప్రమాదం సంభవించిన అంతస్థులో బ్యాంకు శాఖతో పాటు కాల్ సెంటర్ మరియు ఇతర కార్యాలయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.