ఢిల్లీలో మరొక దారుణం : బ్యాటరీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం…

Thursday, January 2nd, 2020, 12:14:14 PM IST

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో చాలా వరకు అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఆ ఘటనలు ఇంకా మరవకముందే ఢిల్లీలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కాగా ఢిల్లీలోని ఒక బ్యాటరీ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అయితే పీరా గర్హి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు శిథిలాల్లో చుక్కుకున్నాడు… అయితే ప్రమాద సమాచారాన్ని అందుకున్న సుమారు 35 అగ్నిమాపక ఇంజన్లు ఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

అంతేకాకుండా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ దళం కూడా చేరుకొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అయితే నేడు ఉదయం 4.30 నిమిషాలకు మొదటగా అగ్నిప్రమాదం జరగగా, అక్కడికి ఏడు ఫైర్ ఇంజిన్లు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి… ఆ తరువాత మళ్ళీ ఉదయం 9 గంటల సమయంలో మళ్ళీ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ అగ్నిప్రమాద ఘటన గురించి సీఎం కేజ్రీవాల్ ఆరా తీస్తున్నారు.