లొంగిపోయిన వనితారెడ్డి..కేసు మలుపు తిప్పే వ్యాఖ్యలు..!

Wednesday, December 27th, 2017, 04:55:26 PM IST

టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన చావుకు కారణం తన భార్య వనిత తోపాటు మరికొందరు అంటూ విజయ్ సాయి తన సెల్ఫీ వీడియో లో ఆరోపించిన సంగతి తెలిసిందే. విజయ్ సాయి సూసైడ్ తరువాత వనిత రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళింది. కాగా నేడు ఆమె జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో లాయర్ తో కలసి వెళ్లి లొంగిపోయారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని వనిత చెప్పింది. పోలీస్ లు తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు తాను సిద్దమే అని వెల్లడించింది. కానీ అంతకంటే ముందు తాను ఈ కేసులో సంపాదించిన ఆధారాలని పోలీస్ ల ముందు బయట పెడుతా అంటూ వనిత వెల్లడించడం గమనార్హం. విజయ్ సాయిని తాను ఎన్నడూ వేధించలేదని, కానీ తన పేరు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో తనకు తెలియదని చెప్పింది. అతని తల్లిదండ్రుల వేధింపుల వలనే విజయ్ సాయి మరణించాడని ఆరోపించడం గమనార్హం.