హైదరాబాద్ హాస్టలర్స్ కు ఓ మార్గం చూపించిన పోలీసులు!

Thursday, March 26th, 2020, 11:37:15 AM IST


కరోనా వైరస్ మూలానా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించేసరికి ఎక్కడిక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తుతో ఎక్కడా బయటకు రాకుండా చూసుకుంటున్నారు. అయితే అకస్మాత్తుగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మూలాన తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అండ్ఫ్రే రాష్ట్రానికి చెందిన యువ ఉద్యోగులు మరియు కోచింగ్ లు అని ఉండిపోయిన వారికి అనేకం ఒక్కసారిగా ఇరుక్కుపోయారు.

దీనితో తమని తమ స్వస్థలాలకు పంపమని అమీర్ పేట్ మరియు ఎస్ ఆర్ నగర్ హాస్టల్ కు చెందిన వారు అంతా స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర వందలాదిగా గుమిగూడి తమ బాధను విన్నవించుకున్నారు. హాస్టల్స్ లో సరైన సదుపాయాలు లేక ఇక్కట్లు పడుతున్న వారికి నిన్నటి వరకు పాసులు ఇచ్చి వారిని ఎక్కడా ఎవరూ అడ్డుకోకుండా చేసేందుకు ఏవేవో చేసారు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. దీనితో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీ ఎత్తున వారు చేరుకోవడంతో వారికి అక్కడి హాస్టల్స్ లోనే తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపినట్టు సమాచారం.