ఏపీ లో ముగిసిన పంచాయతీ ఎన్నికల తుది దశ పోలింగ్

Sunday, February 21st, 2021, 08:30:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 3:30 గంటలకు ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. అయితే తుది దశ లో మొత్తం 3,299 పంచాయితీ లకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 554 సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే రెండు చోట్ల సర్పంచ్ స్తానాలకు మరియు 91 వార్డ్ స్థానాలకి నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే వీటికి నామినేషన్లు దాఖలు కాకపోవడం తో మొత్తం 2,743 సర్పంచ్ మరియు 22,423 వార్డ్ సభ్యుల స్థానాల కొరకు ఎన్నికలు జరిగాయి. అయితే సాయంత్రం నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే తుది దశ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 78.90 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్ధుల వివరాలను వెల్లడించనున్నారు.