బిగ్ ఇన్సిడెంట్: ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం..!

Saturday, August 29th, 2020, 08:25:04 AM IST

ఏపీలో దళితులపై దాడులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో జరిగిన శిరోముండనం మరువకముందే విశాఖ నగర పరిధిలో మరో శిరోముండనం ఘటన వెలుగులోకి వచ్చింది. సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌కుమార్ ‌నాయుడు ఇంట్లో నిన్న జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతుంది.

అయితే నిర్మాత నూతన్‌‌కుమార్ ‌నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే వ్యక్తి 4 నెలలుగా పనిచేస్తూ ఇటీవల పని మానేశాడు. అయితే ఈ నేపధ్యంలో నూతన్‌ ఇంటి భద్రతా సిబ్బంది శ్రీకాంత్‌ను పిలిపించారు. పని ఎందుకు మానేశావని ప్రశ్నించారు. ఆ తరువాత ఈ ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ దుర్భాషలాడుతూ, క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేయించారు. ఆ సమయంలో నూతన్‌కుమార్‌నాయుడు భార్య అక్కడే ఉన్నారని బాధితుడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.