వైసీపీ లోకి క్యూ కడుతున్న తెలుగు తమ్ముళ్లు… దేవినేని ఉమా కి గట్టి షాక్..!

Tuesday, March 2nd, 2021, 08:46:09 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ కి చెందిన పలువురు నేతలు ఇప్పటికే వైసీపీ లోకి చేరారు. మునిసిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తుండటం తో వైసీపీ లోకి చేరుతున్నారు నాయకులు. తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కి గట్టి షాక్ తగిలింది. అయితే ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ కి కీలకంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. అయితే మైలవరం నియోజక వర్గం లో గొల్లపూడి లో టీడీపీ కి ఎక్కువ మద్దతు దారులు ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అక్కడి టీడీపీ కి చెందిన వారు అధికార పార్టీ లోకి చేరుతున్నారు.

అయితే మైలవరం లో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మాని మంత్రి దేవినేని ఉమా ది కూడా అదే ప్రాంతం కావడం విశేషం. ఇప్పటికే ఎంపీటీసీ అభ్యర్దులు నలుగురూ ఆ పార్టీ కు గుడ్ బై చెప్పి వైసీపీ లో చేరారు. అయితే మిగతా స్థానాల్లో కూడా వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కి ఘోర పరాభవం ఎదురైంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరొకసారి టీడీపీ కి భంగపాటు తప్పదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాక పలు చోట్ల టీడీపీ కి అభ్యర్దులు కూడా కరువయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రాంతం లో కూడా ఇదే పరిస్థతి కొనసాగడం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.