అమరావతి భూ కుంభకోణం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద బాబు పై కేసులు నమోదు!

Tuesday, March 16th, 2021, 11:35:31 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ కింద చంద్రబాబు కి నోటీసులు జారీ చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటుగా మాజీ మంత్రి నారాయణ కి సైతం సీఐడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అమరావతి భూ కుంభకోణం కేసుల్లో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120బీ, 166, 167, 217, ప్రోహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేశన్ యాక్టు 1977 మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు కి సంబంధించి చంద్రబాబు కి అధికారులు సీఐడీ కేసు నమోదు చేశారు. అంతేకాక కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడానికి జీవో ఇచ్చారు అంటూ అభియోగం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలా కేసులు నమోదు కావడం దేశంలోనే ఇదే మొదటి సారి అంటూ తెలుగు దేశం పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాక చంద్రబాబు పై వరుస కేసులు నమోదు చేయడం తో పాటుగా, ఇలా వ్యవహరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.