ఢిల్లీలో ఆగని రైతు నిరసనలు.. మార్చ్ 26న భారత్ బంద్..! ‘

Thursday, March 11th, 2021, 02:11:35 AM IST


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన పోరాటం ఆగడం లేదు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్రం ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. అయితే రైతులు చేస్తున్న ఆందోళనలు మార్చి 26వ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపధ్యంలో నేపధ్యంలో తమ తదుపరి కార్యచరణను వెల్లడించారు.

అయితే ఈ నెల 26న సంపూర్ణ భారత్ బంద్ చేయనున్నట్లు రైతు నాయకుడు బూటా సింగ్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతంగా బంద్‌ను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలకు కూడా మద్ధతు తెలుపుతామని అన్నారు. మార్చి 29 న హోలీకా దహన్ పేరిట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ చట్టాల ప్రతులను కాల్చి బూడిద చేసి నిరసన తెలుపుతామని అన్నారు.