ప్రగతి భవన్ ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

Monday, November 23rd, 2020, 05:10:16 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ఎదుట ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. తమ భూమిని ఇతరులకు కట్టబెట్టేందుకు శామీర్‌పేట్‌ సీఐ సంతోష్‌ చూస్తున్నారని ఆరోపిస్తూ భిక్షపతి అనే రైతు, భార్య బుచ్చమ్మతో కలిసి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

అయితే అక్కడ ఉన్న పోలీసులు రైతు కుటుంబాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. శామీర్‌పేట మండలం కొత్తూరు గ్రామంలో తమకు చెందిన 1.30 ఎకరాల భూమిని శామీర్‌పేట్‌ సీఐ సంతోష్‌ వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నాడని, రోజురోజుకు సంతోష్ వేధింపులు ఎక్కువయ్యాయని అందుకే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు వారు పోలీసులకు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.