సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. ఫ్యాన్స్ ఆందోళన..!

Friday, December 25th, 2020, 04:29:24 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. సూపర్‌ స్టార్‌ అస్వస్థతకు గురవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రజినీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని, ఆయనకు ప్రస్తుతం ఎలాంటి కరోనా లక్షణాలు లేవని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బీపీ పెరగడంతోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని బీపీ అదుపులోకి రాగానే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా రెండ్రోజుల క్రితం ఈ చిత్ర బృందంలోని కొందరికి కరోనా సోకడంతో రజనీకాంత్‌ కూడా టెస్టులు చేయించుకోగా నెగిటివ్‌ అని వచ్చింది. అయినప్పటికీ రజనీకాంత్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.