26 పరుగులకు ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్

Friday, January 8th, 2021, 12:29:08 PM IST

ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో మూడవ మ్యాచ్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరి ఆశలు కూడా రోహిత్ శర్మ పైనే అని చెప్పాలి. హిట్ మ్యాన్ రోహిత్ రాకతో టీమ్ ఇండియా బలమైన టీమ్ అని చెప్పాలి. రెండవ టెస్ట్ మ్యాచ్ లో సునాయాసంగా విజయం సాధించిన టీమ్ ఇండియా, మూడవ మ్యాచ్ లో మాత్రం అంత సులువు అనిపించడం లేదు. రోహిత్ శర్మ 26 పరుగులు చేసి ఔట్ అవ్వడం అభిమానులను నిరాశ కి గురి చేసింది.

338 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కి ఆదిలోని దెబ్బ తగిలింది. 77 బంతులు ఆడిన రోహిత్ శర్మ, మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 26 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఔట్ అయ్యే సమయానికి టీమ్ ఇండియా స్కోర్ 70 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 50 పరుగులు సాధించి ఔట్ అయ్యాడు. ముప్పై అయిదు ఓవర్లకు 86 పరుగులు చేసి రెండు వికెట్ లను కోల్పోయింది టీమ్ ఇండియా.