ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ కన్నుమూత… పుష్ప షూటింగ్ లో విషాదం

Friday, January 29th, 2021, 10:42:25 AM IST

200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పని చేసిన ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.శ్రీనివాస్ (54 సంవత్సారాలు) రాత్రి ఒంటిగంట సమయంలో రాజమండ్రి లో గుండెపోటు తో మరణించారు. అయితే ఈ ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ ప్రస్తుతం పుష్ప చిత్రానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం మారేదుమిల్లి లోని అభయారణ్యం లో పుష్ప షూటింగ్ జరుపుకుంటుంది. అయితే శ్రీనివాస్ తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ గా సైతం పని చేశారు. ఈయన మరణం తో సినీ పరిశ్రమ లో విషాదం చోటు చేసుకుంది.

పుష్ప చిత్రానికి విడుదల తేదీ ను ప్రకటించిన మరుసటి రోజే ఇలా జరగడంతో ప్రతి ఒక్కరి విషాదం లో ఉన్నారు. అటు అల్లు అర్జున్ అభిమానులు, పుష్ప చిత్ర యూనిట్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసుపత్రి కి తరలించేందుకు ప్రయత్నించినప్పటికి మార్గం మధ్య లో ప్రాణాలను కోల్పోయారు.