చివరిసారిగా నా తమ్ముడిని చూడలేకపోయా – ఏసుదాసు

Sunday, September 27th, 2020, 07:00:38 PM IST

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కడసారి చూడలేక పోయా అంటూ ప్రముఖ సింగర్ ఏసు దాసు వ్యాఖ్యానించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ఎంతో మంది ను శోక సంద్రంలో ముంచేసింది. ఈ విషయాన్ని సినిమా, సంగీత లోకం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతుంది. అయితే ఎస్పీ బాలు మరియు ఏసు దాసు ఇద్దరు కూడా లెజెండరీ సింగర్స్ అని అందరికీ తెలిసిందే. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్య క్రియలకి ఏసు దాసు హజరు కాలేదు. ఈ విషయం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

బాలు నా సొంత సోదరుడు కంటే ఎక్కువ అని యేసు దాసు వ్యాఖ్యానించారు. ఆయన తో కలిసి చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసా అని, భౌతికం గా బాలు మాన మద్య లేకపోయినా,జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు అని తెలిపారు. సంగీత ప్రపంచం లో ఎస్పీ బాలు చెరిగిపోలేని ముద్రను వేసుకున్నారు అని అన్నారు. ప్రస్తుతం అమెరికా లో ఉండటం మూలానా తన తమ్ముడ్ని కడసారి చూడలేక పోయాను అని యేసు దాసు ఆవేదన వ్యక్తం చేశారు.