గ్రేటర్ వార్: ఓటేసిన ప్రముఖులు…తక్కువగా నమోదు అవుతున్న పోలింగ్!

Tuesday, December 1st, 2020, 10:01:02 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భం గా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంది నగర్ లో ఇప్పటికే మంత్రి కేటీఆర్ సతీ సమేతంగా కలిసి ఓటు వేశారు. కుందన్ బాగ్ లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచి గూడ లో తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

నాంపల్లి లోని వ్యాయమశాల ఉన్నత పాటశాల లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, సీపీ మహేష్ భగవత్ కుందన్ బాగ్ లో ఓటు వేశారు. ఇంక నటుడు నాగ శౌర్య తన తల్లితో కలిసి షేక్ పేట లో ఓటు వేయగా, అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రి పురం డివిజన్ లో తన ఓటు వేశారు. అయితే ఉదయం 9 గంటల వరకు కూడా 0.14 శాతంగా ఓట్లు పొల్ అయ్యాయి. అయితే పలు చోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తుండగా, కొన్ని చోట్ల ప్రశాంతం గా పోలింగ్ జరగుతుంది.