బీజేపీ లో చేరిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ

Monday, October 12th, 2020, 04:13:40 PM IST

తమిళనాడు లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భారత్ లో ఎక్కువ శాతం బీజేపీ తన హవా ను కొనసాగిస్తుంది. తమిళనాడు లో కాంగ్రెస్ పార్టీ లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ బీజేపీ లో చేరారు. సోమవారం నాడు బీజేపీ నేతల సమక్షం లో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. 2010 లో డీఎంకే లో చేరినటువంటి కుష్బూ 2014 లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తాజాగా బీజేపీ లోకి చేరారు. తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఖుష్బూ చేరిక ఇంకా ఆసక్తికరం గా మారింది.

అయితే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ లో కొనసాగిన ఖుష్బూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ పై పలు విమర్శలు చేయడం జరిగింది. ప్రజాబలం లేని నాయకుల చేతిలో పార్టీ రోజురోజుకీ దిగజారి పోతుంది అని విమర్శలు చేశారు. రాజీనామా కూడా చేశారు. సోనియా గాంధీ కి రాసిన లేఖ లో సైతం పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురిపించడంతో అందురు ఊహించినట్టు గానే పార్టీ మారడం జరిగింది. అయితే ఖుష్బూ కి బీజేపీ లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.